NTV Telugu Site icon

Apcc Deeksha:మోడీ హయాంలో సీబీఐ, ఈడీలు కీలుబొమ్మలు

Gidugu Rudraraju

Gidugu Rudraraju

నరేంద్ర మోడీ పాలనపై ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. విజయవాడలో ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సంకల్ప సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. PCC అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అధ్వర్యంలో దీక్ష కొనసాగుతోంది. ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు, మోడీ, అమిత్ షా విధానాలకు నిరసనగా దీక్ష నిర్వహిస్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. మోడీ హయాంలో సీబీఐ, ఈడిలు కీలుబొమ్మలుగా మారాయి. వ్యవస్థల ద్వారా సోనియా, రాహుల్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారన్నారు.

Read Also: Ranga Reddy Crime: చికెన్‌ కోసం వెళ్లాడు.. ప్రాణాలు కోల్పోయాడు..

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటం ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడటమే అన్నారు. అదానీ, అంబానీలకు దేశ సంపదను మోడీ దోచి పెడుతున్నారని రాహుల్ పార్లమెంట్ లో వివరించారు. అందుకే కక్ష పూరితంగా ఆయనపై అనర్హత వేటు వేశారు. అనర్హత వేటు నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు చేస్తాం అన్నారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు, మోడీ, అమిత్ షా విధానాలకు నిరసనగా తిరుపతిలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్న చేపట్టారు కాంగ్రెసు కార్యకర్తలు. విశాఖలోనూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర సంకల్ప్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.

Read Also: Potato Peels : బంగాళాదుంప తొక్కే కదా అని తీసేస్తే..?

Show comments