Site icon NTV Telugu

APCC President: హిమాచల్ ప్రదేశ్ సీఎంకు ఏపీసీసీ అధ్యక్షుడి శుభాకాంక్షలు

Congress

Congress

APCC President: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్‌ సుఖును ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంగా ఎన్నికైన ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్‌లో భారీ విజయంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం పట్ల గిడుగు రుద్రరాజు హర్షం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖును మర్యాదపూర్వకంగా న్యూ ఢిల్లీలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాలని సీఎంను గిడుగు రుద్రరాజు ఆహ్వానించారు.

Pawan Kalyan ‘The Real Yogi’ : చిరంజీవి తమ్ముళ్లు అయినంత మాత్రాన సినిమాలు ఎవ్వరూ ఇవ్వరు

తదనంతరం గిడుగు మాట్లాడుతూ.. సుఖ్వీందర్ సుఖు తాను అనేక పర్యాయాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశామని గుర్తుచేశారు. ఆయన ఈ రోజు ఎంతో అత్యున్నతమైన పదవి అధిరోహించటం చాలా ఆనందంగా వున్నదని వెల్లడించారు. సింగ్ నేతృత్వంలో హిమాచల్ ప్రదేశ్ అనేక ప్రజాకర్షక విధానాలు అమలవుతాయని అన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ జోడో యాత్ర స్పూర్తితో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావటానికి ప్రతి ఒక్కరితో కలిసి ముందుకు వెళతామని గిడుగు తెలియజేశారు.

Exit mobile version