ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ప్రజాస్వామ్యంలో సభలు నిర్వహించుకోవడం మన హక్కు. ప్రభుత్వాలకు పాలించే హక్కు ఎలా ఉంటుందో ప్రతిపక్షాలకు వాయిస్ వినిపించుకునే హక్కు ఉంటుంది. ప్రభుత్వం సెక్యురిటీ కల్పించాలి కాని ఒంటెత్తు పోకడలకు పోకూడదు. జీవో జారీ చేయడమంటే ప్రభుత్వం చేతకాని తనమే. సమావేశానికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, పోలీసులదే అన్నారు. ఎక్కడో రెండు చోట్ల ఘటనలు జరిగాయని మన హక్కులను కాలరాయాలని చూడడం సిగ్గుచేటు అని విమర్శించారు గిడుగు రుద్రరాజు.
Read Also: Top Headlines @5PM: టాప్ న్యూస్
బీజేపీ, వైసీపీ దొందూ దొందే అన్నారు. అధికారంలో ఉంటే ఒక ఆలోచనలు అధికారంలో లేనప్పుడు మరో ఆలోచనలా..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేయలేదా? ప్రజాస్వామ్యం లో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరు. ఇలాంటి జీవోలను కాంగ్రెస్ పక్షాన ఖండిస్తున్నాం. ప్రజలు చాలా పెద్ద ప్రభుత్వాలను చూశారు.. ఇలానే వ్యవహరిస్తే ప్రజలు తిరగబడడం ఖాయం అని హెచ్చరించారు. జగన్ అధికారంలోకి వచ్చాక సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఎనిమిదిన్నరేళ్లుగా చంద్రబాబు, జగన్ ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకొని మోసం చేస్తూనే ఉన్నారు.
బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పధకాలన్నీ వర్తింప చేయాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఏ ఉప ముఖ్యమంత్రికి ట్రాన్సఫర్ చేయించుకొనే పవర్ లేదు. త్వరలో కాంగ్రెస్ పక్షాన యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నాం. జనవరి 26 నుంచి మార్చి 26 వరకు అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీగా పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చార్జ్ షీట్ నమోదు చేస్తాం. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం అన్నారు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు.
Read Also: Shock : అమ్మాయి కడుపులో అరకేజీ వెంట్రుకలు.. ఆపరేషన్ చేసిన డాక్టర్లే షాక్
