Site icon NTV Telugu

Fire Accident: నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన.. భవన యాజమాని అరెస్ట్

Untitled 7

Untitled 7

Nampally: ఈ నెల 13 వ తేదీన నాంపల్లి లోని బజార్‌ఘాట్‌ లోని బాలాజీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 10 కి చేరింది. కాగా గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో భవనం యజమానిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళ్తే.. బజార్‌ఘాట్‌ లోని బాలాజీ రెసిడెన్సీ యజమాని రమేష్ గత కొంత కాలంగా అక్రమంగా కెమికల్స్ ను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పలుసార్లు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చిన తన పంథా మాత్రం మార్చుకోలేదు. నాలుగు అంతస్తుల భవనం లోని స్టిల్ట్ ఫ్లోర్‌లో కెమికల్ డ్రమ్ములు ఉంచాడు. ఈ నేపధ్యంలో దీపావళి రోజు చిన్న నిప్పురవ్వ తో మొదలైన మంటలు ఆ కెమికల్ డ్రమ్ములకు అంటుకోవడం వల్లనే ఈ ఘోరం జరిగింది. దీనితో రమేష్ ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

Read also:Priyanka Gandhi: కర్ణాటక గురించి మాట్లాడటం కాదు.. తెలంగాణలో ఏం చేశారు.. కేసీఆర్‌ పై ప్రియాంక ఫైర్‌

కాగా ఈ ఘటన గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితుడు గతంలో చాల సార్లు రెసిన్ డ్రమ్ములు అలానే డబ్బాలను అక్రమంగా స్టిల్ట్‌లో నిల్వ చేస్తూ పట్టుబడ్డాడని.. ఎన్ని సార్లు చెప్పిన తన పంథా మార్చుకోలేదని.. ఇప్పుడు ఈ ప్రమాదానికి అతనే కారణమని పేర్కొన్నారు. నవంబర్ 11 సాయంత్రం నిందితుడు 35 కిలోల రెసిన్ ఉన్న 32 డబ్బాలను కొనుగోలు చేసాడని.. ఆ రెసిన్ కెమికల్ ఉన్న డబ్బాలను స్టిల్ట్ ఫ్లోర్‌లో నిల్వ చేసాడని.. కాగా నవంబర్ 13 వ తేదీన పిల్లలు బాణాసంచా కలుస్తున్న సమయంలో నిప్పురవ్వలు నిందితుడు ఉంచిన రెసిన్ డబ్బాలను తాకడం వల్ల మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. దీనితో నిందితుడిని అరెస్ట్ చేసి ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 304 (II) 285 (అగ్ని లేదా మండే పదార్థాలకు సంబంధించి నిర్లక్ష్యంగా ప్రవర్తించడం), 286 (పేలుడు పదార్ధానికి సంబంధించి నిర్లక్ష్య ప్రవర్తన), సెక్షన్ 9B (1) (b) పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

Exit mobile version