AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో వాతావరణం పొడిగా మారిపోయింది. మరో రెండు నుంచి మూడు రోజులు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీలంక తీరం వెంట నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి నేడు వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం తాకే అవకాశం ఉంది. భారీవర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read Also: AP New CS Srilakshmi: ఏపీ కొత్త సీఎస్ ఆమెనా ?.. జగన్ తనకు ఫేవర్ గా ఉన్నారా..?
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. గరిష్ఠంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా, అల్పపీడనం క్రమేపీ పశ్చిమ వాయవ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా కేరళ వైపు పయనిస్తుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో తమిళనాడు తీర ప్రాంతాల్లోనూ, ఘాట్ ఏరియాల్లోనూ, కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది. నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరంలో సముద్రం అలజడిగా ఉంటుందని పేర్కొ్ంది. సముద్రంలోకి మత్స్య కారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది ఐఎండీ.
— IMD_Metcentrehyd (@metcentrehyd) November 11, 2022