NTV Telugu Site icon

Minister Ramprasad Reddy: మహిళలకు ఫ్రీ బస్సుపై మంత్రి సమీక్ష.. ఎప్పటినుంచంటే..?

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy: మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసుపై మా హామీ నిలబెట్టుకుంటాం అన్నారు ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. ఈ రోజు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండులో సౌకర్యాలు పరిశీలించిన ఆయన.. మహిళలకు ఫ్రీ బస్సు అమలు విషయంపై సమీక్షించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలపై చర్చించి ఏపీఎస్ఆర్టీసీని అభివృద్ధి చేస్తాం అన్నారు. మెరుగైన బస్సులు సంస్ధకు అందించడానికి పని చేస్తాం.. ప్రైవేటు, ప్రభుత్వ సంస్ధల సమన్వయంగా ఆర్టీసీని నడిపించేందుకు పని చేస్తామని వెల్లడించారు.. మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసు మా హామీ.. దానిని అమలు చేస్తాం అన్నారు.

Read Also: Bihar Reservations: బీహార్ సీఎంకు షాక్.. ఆ చట్టాన్ని రద్దు చేసిన పాట్నా హైకోర్ట్..

ఇక, మంత్రిగా మొదటగా పండిట్ నెహ్రూ బస్టాండును పరిశీలించడం సంతోషంగా ఉందన్నారు రాంప్రసాద్‌రెడ్డి.. ఎందరో ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత నా పైన ఉంది.. కానీ, ఏపీఎస్ఆర్డీసీ ఒక హాఫ్ బాయిల్డ్ లాగా తయారైంది.. కొత్త బస్సులు కొంటాం.. కచ్చితంగా బస్సులు ఉంటేనే సంస్ధ నడుస్తుందన్నారు. మహిళలకు ఫ్రీ సర్వీసు అంటూ ఏదో ఒక బస్సులో సర్వీసు కాకుండా అన్ని మంచి బస్సులే ఇస్తాం అన్నారు. పాత బస్సులు ఉన్న మాట వాస్తవం.. దీనిపై పూర్తి చర్యలు తీసుకుంటాం అన్నారు. ఉద్యోగులకు జీతం, ఉద్యోగం ఏపీ ప్రభుత్వం అనే ఒకే గొడుగు కిందకు తెచ్చి పూర్తి విలీనం చేస్తాం అన్నారు. గత ప్రభుత్వాలపై మేం నిందలేస్తూ కూర్చోం… గత ప్రభుత్వం విలీనం సరిగా చేయలేదని విమర్శించారు. టీడీపీకి అధికారం రావడానికి కారణం ఈ రాష్ట్రంలోని మహిళా మూర్తులు.. మా ప్రభుత్వంలో కార్యక్రమాలు లేటుగా అయినా లేటెస్టుగా చేస్తాం అన్నారు.

Read Also: Avneet Kaur: అందాన్ని ప్రదర్శిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న అవనీత్ కౌర్

ఒక అధ్యయన కమిటీ వేసి, పక్కన రెండు రాష్ట్రాలలో స్వయంగా ప్రయాణించి అక్కడి లోటుపాట్లు తెలుసుకుని మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తాం అన్నారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. చట్ట విరుద్ధంగా ఏదైనా ఫండ్ ఏర్పాటు చేసి ఉంటే కచ్చితంగా మేం రద్దు చేస్తాం.. చర్యలు తీసుకుంటాం అన్నారు. ఇక, కార్మికుడు చనిపోతే అంత్యక్రియలు ఖర్చుకు ఇచ్చే సొమ్ము 25 వేలకు పెంచుతున్నాం.. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం అన్నారు.. ఇక, ఎలక్ట్రిక్ బస్సులు మన రాష్ట్రంలో పూర్తిగా తీసుకొస్తాం అన్నారు ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.