NTV Telugu Site icon

AP TET Results: ఏపీ టెట్-2024 ఫలితాలు విడుదల

Ap Tet

Ap Tet

AP TET Results 2024: ఏపీ టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)- 2024 ఫలితాలను విడుదల చేశారు.. టెట్-2024లో మొత్తంగా 58.4 శాతం మంది అభ్యర్థుల ఉత్తీర్ణత సాధించారు.. కాగా, డీఎస్సీలో టెట్‌ మార్క్‌లకు 20 శాతం వెయిటేజ్‌ కల్పించనున్న విషయం విదితమే.. అయితే, బీఈడీ, డీఈడీ పూర్తి చేసినవారికి త్వరలో మరోసారి టెట్‌ నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది.. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో టెట్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్‌ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,67,789 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,35,907 మంది పరీక్షలు రాశారు.. అంటే దరఖాస్తు చేసిన వారిలో 88.90 శాతం మంది టెట్‌ రాశారు.. వారిలో 1,37,904 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 58.4 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక, టెట్‌ ఫలితాలు మార్చి 14నే విడుదల కావాల్సి ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ కారణంగా వాయిదా పడగా.. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడం.. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటు కావడంతో.. ఫలితాలు విడుదల చేశారు..

Read Also: Stock market: మరోసారి రికార్డ్‌లు సృష్టించిన స్టాక్ మార్కెట్

టెట్‌-2024 ఫలితాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తే.. పేపర్ 1(ఏ) ఎస్జీటీ రెగ్యులర్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 1,13,296గా ఉంటే.. వారిలో 78,142మంది అంటే 66.32 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక, పేపర్ 1(బి) ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్‌ పరీక్షకు 1700 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 790 మంది.. 46.47శాతం ఉత్తీర్ణత సాధించారు. పేపర్ 2(ఏ) స్కూల్ అసిస్టెంట్ రెగ్యులర్ పరీక్షలకు 1,19,500 దరఖాస్తు చేసుకుంటే.. వారిలో 60,846 మంది.. 60.93 శాతం అర్హత పొందారు.. పేపర్ 2(బి) స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షకు 1,411మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,125 మంది.. 79.73 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా పరీక్షలకు హాజరైన వారిలో 58.4 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు.. ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం.. ఎన్నికల్లో డీఎస్సీపై హామీ ఇచ్చింది.. అదే విధంగా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే.. మెగా డీఎస్సీ నిర్వహణ ఫైల్‌పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు.. అంతేకాదు.. తాజాగా జరిగిన కేబినెట్‌ సమావేశంలోనూ మెగా డీఎస్సీ నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.. దీంతో.. ఇప్పుడు టెట్‌లో అర్హత సాధించినవారు డీఎస్సీ రాసుకునే వీలు కలుగుతుంది.