Rain Alert: ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
- ఉక్కపోత నుంచి ఉపశమనం..
- మూడు రోజుల పాటు వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించే వార్తను అందించింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం చల్లబడనుందని అంచనా వేసింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణపై ప్రస్తుతం ఉన్న వాతావరణ ద్రోణి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరఠ్వాడా నుంచి కర్ణాటక తీరం వరకు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ద్రోణి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. దీని ఫలితంగా శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే.. ఈ ఉపశమనం తాత్కాలికమేనని, వచ్చే వారం నుంచి ఎండల తీవ్రత మళ్లీ పెరిగే అవకాశం ఉందని, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికం కావచ్చని అధికారులు వెల్లడించారు.
Also Read:Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
ఆంధ్రప్రదేశ్‌లో కూడా వాతావరణ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు వర్ష సూచన ఉంది. శుక్రవారం వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ.. శని, ఆదివారాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
కోస్తాంధ్రలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. రాయలసీమలో మాత్రం వచ్చే ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగనున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మూడు రోజుల తర్వాత ఎండల తీవ్రత పెరిగే సూచనలు ఉన్నాయి.
రైతులకు, ప్రజలకు సూచనలు
అకాల వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో రైతులు తమ కోతకు వచ్చిన పంటలను భద్రపరుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరబోసిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండల తీవ్రత పెరిగే సమయంలో మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య బయటకు రాకుండా ఉండటం శ్రేయస్కరం.
తాజావార్తలు
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?