NTV Telugu Site icon

Election Commission: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల

Election Commission

Election Commission

Election Commission: ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ మృతితో తూర్పుగోదావరి-పశ్చిమ‌ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నిక కోసం ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నవంబర్ 18 వరకు నామినేషన్లను స్వీకరించి.. 19న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నవంబర్‌ 21 వరకు ఉపసంహరణ గడువుగా పేర్కొన్నారు. డిసెంబరు 5న ఉదయం 8 గంటల నుంచీ సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 9న కౌంటింగ్‌ చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. డిసెంబర్ 12 లోగా ఎన్నిక ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉంది.

Read Also: Minister Narayana: అమరావతి పనులకు కొత్త టెండర్లు పిలవడానికి లైన్ క్లియర్

Show comments