NTV Telugu Site icon

CM Jagan : రాష్ట్రానికి రక్షణ జగనన్న అంటున్న విద్యార్థులు

Rakhi

Rakhi

రక్షాబంధన్.. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ అని, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. అయితే.. ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పిల్లలు సోదర ప్రేమ, కృతజ్ఞతను తెలియజేస్తూ ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించారు. రాష్ట్రానికి రక్ష మన జగనన్నే అని నినాదిస్తూ ప్రతి పిల్లవాడు రాఖీ ఆకారంలో రాష్ట్రవ్యాప్తంగా పలు స్కూళ్లలో మానవహారంగా ఏర్పాడి తమ ప్రియతమ నాయకుడు సీఎం జగన్ పై సోదర ప్రేమ వ్యక్త పరిచారు. ఈ అందమైన రాఖీ ఆకారాలు రాష్ట్రంలో పిల్లలకు ఒక నాయకుడు మధ్య ఉన్న బంధాన్ని వివరిస్తుంది.

Also Read : Komatireddy: వారమే డెడ్ లైన్.. లేదంటే ప్రగతి భవన్‌ ను ముట్టడిస్తాం.. కేసీఆర్‌ కు కోమటి రెడ్డి లేఖ

ఇదిలా ఉంటే… గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కూడా మంత్రి ఆప్యాయతతో పొంగిపోయారు. ఈ ఘటన అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగ్గంపేటకు వెళ్లారు.

Also Read : Pragyan Rover: విక్రమ్ ల్యాండర్ ను ఫోటో తీసిన ప్రజ్ఞాన్‌ రోవర్‌..స్మైల్ ప్లీజ్ అంటూ ఎక్స్ లో షేర్ చేసిన ఇస్రో

అంతకుముందు రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాల‌కు స‌దా కృత‌జ్ఞతుడిని. మీ సంక్షేమ‌మే ల‌క్ష్యంగా.. మీ ర‌క్షణే ధ్యేయంగా పాల‌న సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక‌ అన్నగా, ఒక‌ త‌మ్ముడిగా ఎప్పుడూ అండ‌గా ఉంటాన‌ని మాట ఇస్తున్నాను!’ అని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.