NTV Telugu Site icon

AP Schools Summer Holidays: ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు.. ఉత్తర్వులు జారీ.. ఎప్పటి నుంచంటే..?

Summer Holidays

Summer Holidays

AP Schools Summer Holidays: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ఇప్పటికే స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహిస్తుండగా.. ఇప్పుడు విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఈ నెల నుంచే వేసవి సెలవులు ప్రకటించింది.. వేసవి సెలవులపై అధికారిక ప్రకటన విడుదల చేశారు.. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులుగా పేర్కొన్న విద్యాశాఖ.. వచ్చే అకడమిక్‌ ఇయర్‌.. విద్యాసంవత్సరం 2024-25 కోసం జూన్ 12వ తేదీ నుంచి తిరిగి స్కూళ్లు ప్రారంభం అవుతాయని పేర్కొంది. ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో.. ఈ నెల 23వ తేదీన స్కూళ్లకు చివరి పనిదినంగా ఉండనుంది.

Read Also: Maneka Gandhi: వరుణ్‌ గాంధీ ఏం చేయాలనుకుంటున్నారో.. ఆయన్నే అడగండి..!