Site icon NTV Telugu

Amaravati Capital: రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై చర్చ.. పార్లమెంట్‌కు నారా లోకేష్!

Ap Reorganisation Amendment Bill

Ap Reorganisation Amendment Bill

ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’కి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు’ నేడు రాజ్యసభలో చర్చకు రానుంది. ఈ బిల్లుపై మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు గంటపాటు కీలక చర్చ జరగనుంది. ఈ సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు.. నేడు రాజ్యసభ ఆమోదం కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో మరో ముఖ్యమైన అడుగు పడనుంది.

రాజ్యసభలో జరిగే ఈ కీలక చర్చను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఈరోజు పార్లమెంట్‌కు వెళ్లనున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చర్చలో పలు పార్టీల నేతలు పాల్గొననున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ స్యువ్వ రెడ్డి మాట్లాడనుండగా.. టీడీపీ తరఫున కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరపు పాల్గొననున్నారు. బీజేపీ తరఫున కే లక్షణ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు.

Also Read: Lungi Ngidi Ball: లుంగి ఎంగిడి అద్భుత బంతి.. నికోలస్‌ పూరన్‌ మైండ్ బ్లాక్ అయిందిగా!

బిల్లుపై రాజ్యసభలో జరిగే చర్చ ఏపీ భవిష్యత్‌కు కీలకంగా మారనుంది. అమరావతి రాజధాని అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో.. రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. ప్రధాని మోడిని ఈ రోజు ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్‌లో ఏపీ విద్యా మంత్రి నారా లోకేష్ కలవనున్నారు. ఏపీ నూతన రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించినందుకు ప్రధానికి లోకేష్ కృతజ్ఞతలు తెలుపనున్నారు.

Exit mobile version