Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Rain Alert for Next Two Days: వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే సముద్రం అలజడిగా మారి అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. తీర ప్రాంతాల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
Also Read
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి అనిత సూచించారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తీర ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
తాజావార్తలు
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!