AP Rain Alert: నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. పిడుగులు పడే అవకాశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather Update Today: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. ముఖ్యంగా నేడు పలు జిల్లాల్లో పిడుగులు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు వినిపిస్తున్నప్పుడు చెట్ల కింద నిలబడరాదని, ఈదురు గాలులు వీచే సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
Also Read
- BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
- India A vs Sri Lanka A: చేతులెత్తేసిన బౌలర్లు.. భారత్ ఘోర పరాజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన శ్రీలంక
- Sri Lanka Captain: వారి వల్లే విజయం సాధ్యమైంది.. శ్రీలంక కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..!
- IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
గురువారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా తెనాలిలో అత్యధికంగా 29.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో 25 మి.మీ., తిరుపతి జిల్లా పుత్తూరులో 21 మి.మీ., గుంటూరు జిల్లా వడ్లమూడిలో 20.8 మి.మీ., నెల్లూరు రూరల్‌లో 20 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
- Tags
- ap
- ap rains
- ap weather
- APSDMA
తాజావార్తలు
-
AP Rain Alert: నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. పిడుగులు పడే అవకాశం!
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
Tilak Varma: మాకు ఏదీ కలిసి రాలేదు.. ఆ ఇద్దరే మమ్మల్ని ముంచారు.. మనోళ్లు కూడా..!
-
Women’s Reservation Bill 2026: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ సర్కార్ కీలక నిర్ణయం?.. నేడు కేంద్ర కేబినెట్ భేటీ
-
India A vs Sri Lanka A: చేతులెత్తేసిన బౌలర్లు.. భారత్ ఘోర పరాజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన శ్రీలంక
ట్రెండింగ్
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?