Site icon NTV Telugu

Minister BC Janardhan Reddy: రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కీలక సమాచారం..

Ap Ports

Ap Ports

Minister BC Janardhan Reddy: శాసన మండలిలో పోర్టుల అంశంపై ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, బీటీ నాయుడు, బీద రవిచంద్ర ప్రశ్నించారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.. ఇందులో కీలక సమాచారం వెల్లడించారు. రాష్ట్రంలోని ఉన్న ఏకైక మేజర్ పోర్ట్ అయిన విశాఖ పోర్టు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 141.6 MMTPA సామర్థ్యంతో పనిచేస్తోందని.. నాన్-మేజర్ పోర్ట్ లు గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లు మారిటైమ్ బోర్డు నియంత్రణలో PPP మోడల్‌లో నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. అదానీ గంగవరం పోర్టు 64 MMTPA సామర్థ్యంతో, కాకినాడ డీప్ వాటర్ పోర్టు 26 MMTPA సామర్థ్యంతో, కృష్ణపట్నం పోర్టు 8 MMTPA సామర్థ్యంతో పనిచేస్తున్నాయన్నారు.. నాన్-మేజర్ పోర్ట్ లు కాకినాడ యాంకరేజ్ పోర్ట్, కోనసీమ జిల్లాలోని రవ్వా పోర్ట్ లను ఏపీ మారిటైమ్ బోర్డు నిర్వహణలో ఉన్నాయని వెల్లడించారు..

READ MORE: Sangameswara Temple: బయటపడ్డ సంగమేశ్వర ఆలయం.. ఆలయ చరిత్ర ఇదిగో..!

“కాకినాడ యాంకరేజ్ పోర్టు 5 MMTPA సామర్థ్యం, రవ్వా పోర్టు 2 MMTPA సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. EPC విధానంలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలాపేట (3) గ్రీన్ ఫీల్డ్ పోర్టులు ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నాయి. రామాయపట్నం పోర్టు – 24-04-2026, మచిలీపట్నంలో పోర్టు 28-12-2026, మూలపేట పోర్టు 30-11-2026 తేదీ నాటికి పూర్తి కానున్నాయి. PPP మోడల్ BOOT (బిల్డ్, ఓన్, ఆఫరేట్, ట్రాన్స్ ఫర్) పద్దతిలో తూర్పు గోదావరి జిల్లా కోన గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ కమర్షియల్ పోర్టు అభివృద్ధి చేస్తున్నాం. ఈ ఏడాది ఏడో నెల నాటికి ఇది పూర్తి కానుంది. నిర్మాణంలో ఉన్న ఈ పోర్టులన్నీ అవి పూర్తైన తేదీ నుంచి 6 – 9 నెలలలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ల్యాండ్ లార్డ్ మోడల్‌లో నిర్మిస్తున్న మూలాపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు రైలు & రోడ్డు కనెక్టివిటీకి అవసరమైన భూమి & నిర్మాణ ఖర్చులను ఏపీ మారిటైమ్ బోర్డ్ సమకూరుస్తోంది. పీపీపీ విధానంలో నిర్మిస్తున్న కాకినాడ SEZ పోర్టు విషయంలో NH-16 కి రోడ్డు అనుసంధానం NHAI అందిస్తోంది.. రాష్ట్ర ప్రభుత్వం రాయితీదారుడి ఖర్చుతో రైలు అనుసంధానానికి భూసేకరణకు వీలు కల్పిస్తోంది..” అని మంత్రి మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడించారు.

READ MORE: Divorce case: వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు ఇవ్వలేం.. హైకోర్టు కీలక తీర్పు..

Exit mobile version