NTV Telugu Site icon

Congratulations Team India : టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ప్రముఖులు..

Teamindia2

Teamindia2

రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు అభినందనలు తెలిపారు పలువురు ఏపీ ప్రముఖులు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుందని.. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమష్టిగా రాణించిన తీరు అద్భుతం అని.. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరునా హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మీ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకమని., ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్ లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తునట్లు ఆయన తెలిపారు.

Rohit Sharma Retirement: రోహిత్‌ శర్మ సంచలన నిర్ణయం.. టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్‌!

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు అభినందనలు తెలిపారు. భారత్ జట్టు టీ20 ప్రపంచ కప్ గెలిచిన తీరు అద్భుతమైంది. రోహిత్ సేన 13ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. సూర్య కుమార్ యాదవ్ చివరి ఓవర్‌లో తీవ్రమైన ఒత్తిడిలోనూ అద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. టీమిండియాను చూసి దేశం గర్విస్తోంది అంటూ ఆయన టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్.. విశ్వ విజేతగా భారత్‌

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రను తిరగరాసిందని., 17 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకమైన టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవాలనే కలను రోహిత్ సేన సాకారం చేసింది. భారత క్రికెట్ జట్టుకు, సహాయక సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలని., దేశాన్ని ఆనంద వేడుకల్లో ముంచెత్తినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆయన.