AP Petrol Supply: ఏపీలో పెట్రోల్ సరఫరా కోతలు.. బంక్ యజమానుల్లో ఆందోళన!
- పెట్రోల్, డీజిల్ సరఫరా విషయంలో కొత్త సమస్య
- పెట్రోల్ బంకులకు సరఫరా కోతలు
- రాష్ట్ర వ్యాప్తంగా బంక్ యజమానుల్లో ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ సరఫరా విషయంలో కొత్త సమస్య తలెత్తింది. ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్ బంకులకు సరఫరాలో కోతలు విధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బంక్ యజమానుల్లో ఆందోళన నెలకొంది. సరఫరా తగ్గిపోవడంతో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీలు, డీలర్స్ మధ్య కీలక చర్చలు నేడు జరగనున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు కానూరులోని సివిల్ సప్లైస్ కార్యాలయంలో సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఏపీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొననున్నారు. ఇంధన సరఫరా విధానం, ప్రస్తుత పరిస్థితులు, ఎదురవుతున్న సమస్యలపై చర్చించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న రేషన్ విధానాన్ని తొలగించాలని పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. సరఫరా పక్కాగా, నిరంతరాయంగా కొనసాగాలని వారు కోరుతున్నారు. బంక్ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థలో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read
మరోవైపు ఆయిల్ కంపెనీలు మాత్రం సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తున్నాయి. కొన్ని బంకులు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇండస్ట్రీస్, పెద్ద కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తూ సరఫరా చేయడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితిని ప్రభావితం చేసే అవకాశముండడంతో అందరి దృష్టి ఈ సమావేశంపైనే ఉంది. సమస్యకు సరైన పరిష్కారం దొరకుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!