AP Panchayat Elections: విశాఖ జిల్లాలో కూటమిలో చిచ్చు.. జనసేన వర్సెస్ టీడీపీగా మారిన పంచాయతీ పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Elections: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు అధికార కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల మధ్య పోరుగా మారుతున్నాయి. చోడవరం, భీమిలి నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య ఆధిపత్య పోరు మొదలైందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం, నామినేషన్ల వ్యవహారాలు ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.
ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు
చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం రత్నంపేటలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు అనూహ్య పరిణామం ఎదురైంది. టీడీపీ మద్దతుదారుడి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటాన్ని గమనించిన ఎమ్మెల్యే ప్రచారాన్ని మధ్యలోనే నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Vishnu Kumar Raju: విశాఖలో బీజేపీ అసంతృప్తి.. డిప్యూటీ మేయర్ పదవిపై విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు
- Vizag Crime: ఇన్‌స్టా పరిచయంతో ఇంట్లోకి ఎంట్రీ.. బంగారం, వజ్రాల నగలతో పరారీ..!
- Araku Valley Weather: పడిపోయిన ఉష్ణోగ్రతలు!.. అరకు లోయలో మంచు అందాలు..
- CII Partnership Summit 2026: ఏపీకి భారీ పెట్టుబడుల వెల్లువ.. రెండో రోజు రూ.1.41 లక్షల కోట్ల ఒప్పందాలు..
భీమిలిలో నామినేషన్ల వివాదం.. సందీప్ ఆందోళన
మరోవైపు భీమిలి నియోజకవర్గంలోనూ పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పద్మనాభం మండలం బీఆర్ తాళ్లవలసలో జనసేన అభ్యర్థుల నామినేషన్లను టీడీపీ అడ్డుకుంటోందని భీమిలి జనసేన ఇన్ఛార్జ్ సందీప్ ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో పోటీ చేస్తే గ్రామంలో ఉండనివ్వమంటూ కొందరు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. జనసేన అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకునే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. జీవీఎంసీ, పరిషత్ ఎన్నికల సమయంలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సాధ్యమైనప్పుడు పంచాయతీ ఎన్నికల్లో జనసేన కొత్త పంచాయతీ ఎందుకు పెడుతోందని ప్రశ్నించారు. గ్రామస్థాయి ఎన్నికల్లో ఇలాంటి వివాదాలు ఎందుకు తలెత్తుతున్నాయో జనసేన నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసేన అధిష్ఠానం క్లారిటీ
మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే విషయంపై ఇప్పటికే పార్టీ అధినాయకత్వం స్పష్టత ఇచ్చింది. పార్టీ గుర్తుతో సంబంధం లేకుండా జరిగే ఎన్నికలు కావడంతో గ్రామాల్లో బలమున్న నాయకులు, కార్యకర్తలు పోటీలో నిలవాలని సూచించింది. ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని పార్టీ నాయకత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన మధ్య పోటీ వాతావరణం నెలకొంది. రాష్ట్రస్థాయిలో కూటమిగా కొనసాగుతున్న రెండు పార్టీలు గ్రామస్థాయిలో మాత్రం ఆధిపత్యం కోసం పోటీపడుతుండటం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు కూటమి రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
UP Elections: ఎన్నికల వేళ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంచాయితీ..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
Rahman : ‘రామాయణ’ కోసం 12 బడా సినిమాలకు ‘నో’ చెప్పిన ఏఆర్ రెహమాన్
-
Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
-
Record: సుకుమార్ క్యాంప్‌లో కిరణ్ అబ్బవరం.. పోస్టర్ మిస్టరీ?
ట్రెండింగ్
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు