AP Panchayat Elections: తిరుపతి, బాపట్ల జిల్లాల్లో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tensions in Tirupati and Bapatla: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ తిరుపతి, బాపట్ల జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తిరుపతి రూరల్ మండలం ముళ్లపూడి గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరగగా.. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో పోలింగ్ కేంద్రం వద్ద వివాదం తీవ్రరూపం దాల్చింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగారు. బచ్చులవారిపాలెంలో పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
తిరుపతి రూరల్ మండలం ముళ్లపూడి గ్రామంలో బయట వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోకి రావడంతో వివాదం మొదలైంది. పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు పోలింగ్ బూత్‌లలోకి చొరబడటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రంలో ఏజెంట్‌గా ఉన్న మాజీ సర్పంచ్ శెల్వంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ నేతలు, మహిళలపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సురేష్ రెడ్డి, ధనముని రెడ్డి వర్గాల మధ్య వివాదం చెలరేగడంతో.. ఇరువర్గాల వారు కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో గ్రామంలో కొంతసేపు హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Also Read
- Sai Pallavi: సీత పాత్ర ట్రోల్స్.. పెదవి విప్పిన సాయి పల్లవి..!
- KTR: డీలిమిటేషన్‌తో తెలంగాణలో 180 అసెంబ్లీ స్థానాలు.. 26 లోక్‌సభ సీట్లు పెరుగుతాయ్..!
- Bollywood Villains in Tollywood: టాలీవుడ్లో తేలిపోతున్న బాలీవుడ్ యంగ్ విలన్లు!
- Delimitation 2026: డీలిమిటేషన్‌పై విపక్షాల ప్రధాన ఆందోళన ఇదే! అసలు జెర్రీమాండరింగ్ అంటే ఏంటి?
మరోవైపు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలోని ఐదో నంబర్ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కొందరు ఓటర్ల ఓట్లను ఇతరులు వేసేశారంటూ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. తమ ఓట్లను మరొకరు ఎలా వేస్తారని ప్రశ్నిస్తూ ఓటర్లు అధికారులను నిలదీశారు. ఈ ఘటనపై రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఆయన వాహనంపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగి.. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
AP Panchayat Elections: తిరుపతి, బాపట్ల జిల్లాల్లో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!
-
Sai Pallavi: సీత పాత్ర ట్రోల్స్.. పెదవి విప్పిన సాయి పల్లవి..!
-
KTR: డీలిమిటేషన్‌తో తెలంగాణలో 180 అసెంబ్లీ స్థానాలు.. 26 లోక్‌సభ సీట్లు పెరుగుతాయ్..!
-
Bollywood Villains in Tollywood: టాలీవుడ్లో తేలిపోతున్న బాలీవుడ్ యంగ్ విలన్లు!
-
Delimitation 2026: డీలిమిటేషన్‌పై విపక్షాల ప్రధాన ఆందోళన ఇదే! అసలు జెర్రీమాండరింగ్ అంటే ఏంటి?
ట్రెండింగ్
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!