Site icon NTV Telugu

AP NDA Leaders: శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక.. గవర్నర్కు లేఖ

Governor

Governor

AP NDA Leaders: రాజ్ భవన్ లో ఎన్డీయే కూటమి నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్డీయే శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్టు గవర్నుకు లేఖ అందించారు. చంద్రబాబుకు మద్దతిచ్చిన 164 మంది సభ్యుల జాబితాను గవర్నర్ కు అందించిన వారిలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీ టీడీపీ అధినేత కింజారాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును మూడు పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. అన్ని వివరాలు గవర్నర్ కు అందించాం.. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించాలని కోరాం.. సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ నుంచి పిలుపు వస్తుంది.. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Read Also: USA vs IND: శివమ్ దూబెపై వేటు.. ఐపీఎల్ స్టార్‌కు చోటు!

అంతకుముందు, ఈరోజు ఉదయం విజయవాడలో ఎన్డీయే కూటమి సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు.. దానిని బీజేపీ ఎమ్మెల్యేలు బలపర్చారు. దీంతో ఎన్డీయే కూటమి శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Exit mobile version