Somasila Project: నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణలతో కలిసి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన జరిగిందని, రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే జలవనరుల శాఖకు గత ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు. సోమశిల లాంటి జలాశయాన్ని ప్రమాదకర పరిస్థితిలోకి తీసుకొచ్చారన్నారు.
Read Also: Home Minister Anitha: యువకుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌ని పరామర్శించిన హోం మంత్రి
ఆఫ్రాన్ దెబ్బతిని మూడేళ్ళయినా మరమ్మతులు చేయలేదన్నారు. దీనికి మరమ్మతులు చేయకపోతే డ్యామ్ కొట్టుకోపోయే ప్రమాదం వుందన్నారు. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తే జలవనరుల శాఖ మంత్రిగా వున్నా ఏమీ చేయలేదన్నారు. గేట్లకు చెందిన రోప్స్ కూడా దెబ్బతిన్నాయని.. కనీసం గ్రీస్ కూడా పెట్టలేదన్నారు. 60 రోజుల్లో ఆఫ్రాన్ మరమ్మతు పనులను ప్రారంభిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.