ఏపీలో ఎన్నికల్లో జోరు పేరిగింది. నిన్న ఎన్నికల నోటిషికేషన్ విడుదల కావడంలో పశ్చిమగోదావరి జిల్లాలో నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు మంత్రులు. గోపాలపురంలో హోంమంత్రి తానేటి వనిత నామినేషన్‌కు సిద్ధం కాగా… తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు నామినేషన్ వేయనున్నారు. భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అని, దెందులూరులో ఎమ్మెల్యే అబ్బాయచౌదరి నామినేషన్లు అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే.. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టి.. చీపురుపల్లి మూడు రోడ్ల కూడలి వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.
KTR Twitter: భట్టి విక్రమార్క మాట మార్చారు.. కేటీఆర్ ట్వీట్ వైరల్
ఏపీలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే గురువారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. దశమి, గురువారం మంచిరోజు కావడంతో తొలిరోజునే అభ్యర్థులు భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. 25 లోక్‌సభ స్థానాలకు 39 మంది అభ్యర్థులు 43 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా నగరి పట్టణం పుదుపేట్ వినాయక స్వామి ఆలయంలో మంత్రి రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. నగరి పట్టణం వీధుల్లో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి రోజా నామినేషన్ ర్యాలీలో బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కారుమూరి నివాసానికి వేల సంఖ్యలో వైఎస్సార్‌సీపీ అభిమానులు చేరుకున్నారు. తన నివాసం నుండి వేలాదిమందితో భారీ ర్యాలీగా బయలు దేరారు. నేటి ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే ఈసీ అధికారులు అనుమతిస్తున్నారు.
Raman Subba Row: మాజీ టెస్ట్ క్రికెటర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ మృతి..
