Seediri Appalaraju: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు.. ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి ఎలా అవుతారంటూ ఎద్దేవా చేశారు.. ఇక, పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తాడో ముందుగా చెప్పాలని సెటైర్లు వేశారు.. ముఖ్యమంత్రి కావాలంటే 88 మంది ఎమ్మెల్యేలు గెలవాలి.. అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయలేనప్పుడు సీఎం ఎలా అవుతాడు? అని ప్రశ్నించారు. ఏదో కార్యకర్తలను ఉత్సాహ పరచడానికే సీఎం అవుతానని ఆయనే చెప్పుకుంటున్నారని.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక సీరియస్‌నెస్ లేదన్నారు.
Read Also: IND vs WI: ఐపీఎల్లో ఆడలేదని.. ఆ ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేయలేదు- వసీం జాఫర్
పవన్ కల్యాణ్ మాటలకు చేతులకు పొంతన ఉండదు.. నిలకడ లేని నేత పవన్ అని దుయ్యబట్టారు మంత్రి అప్పలరాజు.. అసలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత ఆంద్రప్రదేశ్ ఎందుకు చేయాలో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు.. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకా? గతంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి సాగుతున్నందుకా? చరిత్రలో నిలిచిపోయేలా పథకాలు అమలు చేస్తున్నందుకా? ఎందుకు వైసీపీ రహిత ఏపీ చేయాలో చెప్పాలంటూ మండిపడ్డారు. చంద్రబాబుకి వంత పాడటమే పవన్ చేసిన మొదటి తప్పగా పేర్కొన్నారు.. చంద్రబాబు వెనుక వెళ్లే ముఖ్యమంత్రి కాదు కదా.. ఎమ్మెల్యే కూడా కాలేడు అని జోస్యం చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌ని తిట్టడమే పవన్ కల్యాణ్ అజెండా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.