NTV Telugu Site icon

Satya Kumar Yadav: మంత్రి సత్యకుమార్‌ కీలక వ్యాఖ్యలు..

Satya Kumar Yadav

Satya Kumar Yadav

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌.. సమావేశంలో జరిగిన చర్చలు, చేసిన తీర్మానాలను వివరించారు. ఎన్నికల సరళి.. దేశంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు.. అక్కడ జరిగిన ఎన్నికల సరళి పై సమీక్ష చేయడం జరిగింది.. సమావేశంలో రెండు తీర్మానాలు చేసుకున్నాం.. ఒకటి నరేంద్ర మోడీకి అభినందనలు.. రెండవది రాష్ట్రంలో అద్భుత విజయం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు అన్నారు. తీర్మానాన్ని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసరావు రాజూ, సీఎం రమేష్ కి సోము వీర్రాజు సమర్పించారని తెలిపారు.. ఇక, 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటకి వచ్చి సంతోషంగా జీవిస్తుంది పరిస్థితులు గురించి.. రైతులకు పీఎం కిషన్ సహాయం.. ఎరువుల సహాయం.. పూర్తికాని పెండింగ్ ప్రాజెక్టుల గురించి.. 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ అందుకోట్ల లబ్ది.. 30 కోట్ల సురక్ష భీమ యోజన.. 45 కోట్ల మందికి ముద్ర యోజన సహా పలు అంశాలపై చర్చించామన్నారు.

అయితే, ఒక వర్గం మీడియాలో బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. 2019కి 26.56 శాతం ఓట్లు ఉంటే.. 2024 నాటికి 36.56 శాతం వచ్చాయని వెల్లడించారు సత్యకుమార్‌.. కాంగ్రెస్ మూడు సార్లు ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా.. ఇపుడు ఏదో ఘన విజయం లా చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు.. కూటమి ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ గారికి… కార్యకర్తల మధ్య సమన్వయాన్ని సక్రమంగా ఉండేలా చూస్తిన్న చంద్రబాబుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేయబడ్డాయి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు.. విద్యుత్ శాఖలో లక్ష 30వేల అప్పులు తీర్సుకున్నారు. ప్రతి శాఖలోనూ పెద్దమొత్తంలో అప్పులు చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రధాని మోడీ నాయకత్వంపై నమ్మకం.. పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు మీద విశ్వాసంతో ఏపీలో ప్రజలు గెలిపించారు. కనా, ఆర్థిక విధ్వంసం తీర్చాలంటే.. కొన్ని దశాబ్దాల సమయం పట్టేలా ఉందన్నారు.

ఇక, ముంపు ఏడు మండలాన్ని కేబినెట్ లో ఆమోదం తెలిపింది.. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందిస్తుందన్నారు సత్యకుమార్.. పూర్తి చేసే బాధ్యత 2 ఏళ్లలో పూర్తి అని ప్రధాని చెప్పరు.. గత ప్రభుత్వం చేతకానితనం వల్ల.. డయాఫ్రమ్ ఢ్రాం దెబ్బతిందని విమర్శించారు. అమరావతికి మొదటి నుండి బిజెపి మద్దతు ఉంది.. ఒకే రాజధాని ఉండాలని స్పష్టం చేశారు.. అమరావతి నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చింది.. కేంద్రం మధ్యవర్తిత్వం ఉందన్నారు. మరోవైపు, తెలుగు తమ్ముళ్ల మధ్య విధ్వేషాలు తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. ఇక, అనారోగ్య శాఖగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని మార్చేశారు… ఇపుడు ఉన్న ఆస్పత్రిలో మిషన్లు సరిగ్గా పనిచేయడం లేదు.. వీటిపై సమీక్ష చేస్తున్నాం.. రేపు సీఎంతో భేటీ ఉందన్నారు. రాజకీయ ప్రమేయంతో పాటు కొంత మంది అధికారుల కూడా శాఖల్లో అవకతవకలు జరిగాయి.. పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకుంటున్నాం అన్నారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్.