NTV Telugu Site icon

Minister Roja: పవన్ ఆటలో అరటిపండు.. మంత్రి రోజా ఘాటు విమర్శలు

Roja

Roja

వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రి ఆర్కే.రోజా ఘాటు విమర్శలు చేశారు. ఆటలో అరటిపండు లాంటి పవన్ కళ్యాణ్ జగన్ ను ఓ ఆట ఆడిస్తాడా అని సెటైర్లు వేశారు.

Ashu Reddy : అది తలుచుకుని తీవ్రంగా బాధపడుతున్న హాట్ బ్యూటీ..

దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరవమంటే అరుస్తాడు.. కరవమంటే కరుస్తాడని మంత్రి రోజా విమర్శించారు. పవన్ కి ఒక జెండా లేదు ఎజెండా లేదని దుయ్యబట్టారు. పవన్ తన బ్రో సినిమా నాలుగు ఆటలు ఆడించుకోలేకపోయాడు.. అలాంటి పవన్ జగన్ ని ఒక ఆట ఆడిస్తాడంట అని సెటైర్లు వేశారు. దేశాన్ని గడగడలాడించిన సోనియాకు జగన్ ను ఆడించడం కుదరలేదు.. అరటిపండు లాంటి పవన్ నువ్వు ఆడిస్తావా అంటూ విమర్శలు చేశారు.

Nitish Kumar: 2024లో బీహార్ నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది.. నితీశ్ జోస్యం

పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు లాంటివాడని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదవటమే పవన్ పని అని.. సొంత తల్లిని, పార్టీని తిట్టినా ప్యాకేజీకి కక్కుర్తి పడిన వ్యక్తి పవన్ అని అన్నారు.
చంద్రబాబు చాదస్తంతోనే పిచ్చివాగుడు వాగుతున్నాడని.. చంద్రబాబు నిజంగా సింహం లాంటివాడు అయితే సింగిల్ గా పోటీ చేయాలని మంత్రి రోజా సవాల్ చేశారు.