ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం పాలనను సుసంపన్నం చేసే దిశగా చర్యలు చేపడుతోంది. 2014లో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే క్యాంటీన్ల ప్రారంభంపై సంతకం చేశారు.మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మూడు వారాల్లో 100 అన్న క్యాంటీన్లను తెరవాలని ప్రణాళిక చేస్తున్నం అన్ని తెలిపారు 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 184 క్యాంటీన్లు నాలుగుకోట్ల మందికి పైగా ఆకలి తీర్చినట్లు చెప్పారు . వైసీపీ ప్రభుత్వం రాకముందు మూతబడిన క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు 203 క్యాంటీన్లను సెప్టెంబర్ 21 నాటికి పూర్తి చేయాలని టీడీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.