Site icon NTV Telugu

Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్!

Naralokesh

Naralokesh

బుధ, గురు వారాల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌తో లోకేశ్‌ భేటీ అవ్వనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్‌ పాసవాన్‌తో సమావేశం ఏపీ మంత్రి కానున్నారు.

Also Read: YS Jagan: నేడు రెంటపాళ్లకి వైఎస్‌ జగన్‌.. పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ!

ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో, 5.30 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌తో నారా లోకేశ్‌ సమావేశమవుతారు. ఇక గురువారం ఉదయం కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో భేటీ అవుతారు. రేపు సాయంత్రం బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌తో లోకేశ్‌ సమావేశం కానున్నారు. రెండు రోజుల పర్యటన అనంతరం నారా లోకేష్ తిరిగి రానున్నారు.

Exit mobile version