Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రులతో సమావేశం అవుతారని సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ ఇప్పటికే పలుమార్లు కేంద్రమంత్రులను కలుసుకొని రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, అనుమతుల విషయాలపై ప్రస్తావించారు. ఫలితంగా, కొత్త ప్రాజెక్టుల రాకతో పాటు అనుమతులు వేగంగా మంజూరు అవుతున్నాయి. తాజాగా రాష్ట్రానికి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్‌కు లోకేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపనున్నారు.
Rahul Gandhi Bihar Yatra: బీహార్‌లో ఓట్ల దోచుకునేందుకు చూస్తున్నారు: రాహుల్ గాంధీ
నారా లోకేష్ రేపు ఢిల్లీలో రోడ్డురవాణా, రహదార్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని , ఓడరేవులు, జలరవాణాశాఖ మంత్రి సర్పానంద్ సోనోవాల్ ను, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కేంద్రమంత్రులను వరుసగా కలవనున్నారు. రాష్ట్రానికి అత్యవసరంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై కేంద్రం నుండి సహకారం పొందే దిశగా వివిధ ప్రతిపాదనలను నారా లోకేష్ సమర్పించనున్నారు. ఈ భేటీల ద్వారా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Cyclone Alert: ఏపీ ప్రజలు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో 24 గంటల్లో?
