NTV Telugu Site icon

Praja Darbar: 6 నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేస్తాం: మంత్రి నారా లోకేష్

Nara Lokesh Praja Darbar

Nara Lokesh Praja Darbar

Minister Nara Lokesh Meets Goldsmiths: ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రజా దర్బార్‌లో మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేసి.. కార్మికులను ఆదుకుంటాం అని చెప్పారు. మంగళగిరిని గోల్డ్ హబ్‌గా రూపొందిస్తామనే హామీకి తాము కట్టుబడి ఉన్నామని నారా లోకేష్ చెప్పారు. అమరావతిలో నేడు జరిగిన ప్రజా దర్బార్‌లో పలువురు స్వర్ణకారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మంత్రికి తమ సమస్యలు చెప్పకున్నారు.

ప్రజా దర్బార్‌లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ‘ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకుంటాం. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేస్తాం. స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలేంటి?, ఏ విధంగా ఉండాలి, స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి వివరాలు ఇవ్వండి. మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారు. మంగళగిరిని గోల్డ్ హబ్‌గా రూపొందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నాం’ అని చెప్పారు.

Also Read: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌!

ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు అనంతరం బాధ్యతలు చేపట్టారు. మెగా డీఎస్సీకి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అలాగే పలు ఫైల్స్‌ను ఆయన పరిశీలించారు. తన దృష్టికి తెచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలకు లోకేష్ తెలిపారు.