ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్, హీరో సుమన్ సందర్శించారు. నీరా కేఫ్ కు వచ్చిన జోగి రమేశ్ కు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. తర్వాత జోగి రమేశ్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నీరా కేఫ్‌లో లభ్యమవుతున్న ఉత్పత్తుల గురించి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. దేవతలు తాగిన ఔషధం నీరా అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని ఆయన కొనియాడారు.
Also Read : Aadhaar: ఆధార్ కార్డ్ పోయిందా..? అయితే ఇలా ఆన్‌లైన్ నుంచి పొందండి..
నీరాని ప్రమోట్ చేసి ఔనత్యం పెంచారని, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటివి ఏర్పాటు చేయాలని.. సీఎం జగన్ దృష్టి కి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఇది ఒక ఔషధమని, ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయన అన్నారు. పలు పరిశోధనల్లో శాస్ర్తీయంగా నిరూపితం అయ్యిందని ఆయన వెల్లడించారు. చాలా మంది నీరాపై దుష్ప్రచారం చేశారని, గీత వృత్తి కార్మికుల కోసం నీరా కేఫ్ ని అందుబాటులో కి తీసుకువచ్చామన్నారు.
Also Read : Gangula Kamalakar : ప్రారంభానికి సిద్దంగా యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలు
