NTV Telugu Site icon

Dharmana Prasada Rao: ఇప్పటి వరకు అసైన్డ్ భూమి ఎవరికైనా అమ్మితే చెల్లదు..

Dharmana

Dharmana

Dharmana Prasada Rao: సీఎం జగన్ నాయకత్వంలో ప్రభుత్వం భూమికి సంబంధించి అనేక సంస్కరణలు చేపట్టిందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అన్నారు. 20 ఏళ్లు భూమి సాగు చేసుకున్న వారికి ఇప్పుడు యాజమాన్య హక్కులు కల్పించామన్నారు. యాజమాన్య హక్కు ఇవ్వటం అంటే హోదా పెంచడం… అంతే కానీ అమ్ముకోవడం కోసం కాదన్నారు. రాష్ట్రంలో 21 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఉందని.. 19 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని మంత్రి తెలిపారు. భూమి విషయంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. సమగ్ర భూ సర్వే జరుగుతోందని మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇంటి పట్టా ఇచ్చిన పదేళ్ల తర్వాత అమ్ముకునే వెసులుబాటు కల్పించామన్నారు.

Also Read: YV Subbareddy: పంచకర్ల రమేష్ బాబు రాజీనామా తొందర పాటు చర్య

ఇనాం చట్టం వచ్చినప్పుడు అందరికి పట్టాలు ఇచ్చారని.. లంక భూములకు సంబంధించి 9వేల ఎకరాలకు పైగా భూములకు పట్టాలు ఇచ్చామన్నారు మంత్రి ధర్మాన. ప్రభుత్వ ఫిలాసఫీ భూమి ఇచ్చి ప్రజల ఆస్తుల విలువ పెంచడమేనని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అసైన్డ్ భూమి ఎవరికైనా అమ్మితే చెల్లదన్న మంత్రి.. చట్టం వచ్చిన తర్వాత మాత్రమే అమ్ముకునే వెసులుబాటు ఉంటుందన్నారు.