Site icon NTV Telugu

AP RGUKT 2023: ఆర్జేయూకేటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Rjukt

Rjukt

AP RGUKT 2023: ఆంధ్రప్రదేశ్ ఆర్‌జేయూకేటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ విడుదల చేశారు. ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థుల జాబితాను రిలీజ్ చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని అన్నారు. ఆర్జేయూకేటీల్లో అర్హులైన అభ్యర్ధుల జాబితాను విడుదల చేశామన్నారు. అర్హులైన వారికి ఈ నెల 20 నుంచి 25 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.

Alor Read: Adapa Seshu: చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనేదే పవన్ తాపత్రయం

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఐఐటీ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్జీయూకేటీని ప్రారంభించారని మంత్రి చెప్పారు. 6 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు కోసం పదవ తరగతి మార్కులే ప్రాతిపదిక అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,400 సీట్లు ఉన్నాయని.. వీటి కోసం 38,355 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళంలలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఒక్కో క్యాంపస్ లో 1100 సీట్లను భర్తీ చేస్తున్నామన్నారు.

Exit mobile version