Site icon NTV Telugu

Botsa Satyanarayana: పవన్‌ కళ్యాణ్ కామెంట్స్‌కు బొత్స కౌంటర్

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ముందు వాలంటీర్ల విధివిధానాలు ఏంటో పవన్ కళ్యాణ్‌కు తెలుసా? అంటూ మంత్రి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఆడపిల్లలపై అసభ్యకరంగా మాట్లాడటం కరెక్టా అంటూ మాట్లాడారు. ఇది సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే అద్భుతమైన వ్యవస్థగా గుర్తింపు పొందిందని.. దీని వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందనే దుర్బుద్ధితో ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. తాము చేసిన ఆరోపణలకు, సెలబ్రిటీ చేస్తున్న ఆరోపణలకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు.

Also Read: AP RGUKT 2023: ఆర్జేయూకేటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

టీడీపీ సమయంలో సర్వే పేరుతో సమాచారం తీసుకుని ఓటర్ల లిస్ట్‌లో పేర్లు తొలగించారని.. అప్పుడు తానే డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పవన్‌ కల్యాణ్ ఆయన పార్టనర్ మాత్రమే హైదరాబాద్‌లో ఉంటారని, ప్రజల డేటాను హైదరాబాద్‌లో ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏ డేటా ఎక్కడ ఉందో పవన్ కళ్యాణ్‌కు తెలుసా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు సన్నిహిత సింగపూర్ మంత్రిని అరెస్ట్ చేశారని.. ఆ మంత్రినే తీసుకొచ్చి అమరావతిలో చంద్రబాబు అట్టహాసంగా ప్రచారం చేశారని మంత్రి ఎద్దేవా చేశారు. సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం సరైనది కాదని ఆనాడే చెప్పామన్నారు. పవన్ కల్యాణ్ గాలి మాటలు మాట్లాడుతున్నారన్న మంత్రి.. ఆయన మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ బురద చల్లాలని చూస్తున్నారని.. ఏ నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయో పవన్ కల్యాణ్ చెప్పాలన్నారు. నిఘా వర్గాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే పవన్ కళ్యాణ్ చూపించాలని మంత్రి బొత్స పేర్కొన్నారు.

Exit mobile version