AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
- ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామం
- సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
- అక్టోబర్ 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటన నిలిపివేత
- నామినేషన్లపై వచ్చిన ఫిర్యాదులు, పత్రాలు, ఎలక్ట్రానిక్ ఆధారాల పరిశీలన
- నామినేషన్ల గడువు పొడిగింపుపై అక్టోబర్ 22లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నామినేషన్ల దాఖలు విషయంలో తలెత్తిన వివాదాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 వరకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించకుండా నిలిపివేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పలుచోట్ల తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగానికి పలు ఆదేశాలు ఇచ్చింది. నామినేషన్లు దాఖలు చేయలేకపోయినట్లు ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలకు సంబంధించిన పత్రాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలను పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లో నామినేషన్ల గడువు పొడిగించాలా లేదా అనే అంశంపై ఈ నెల 22లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గడువు పొడిగించాలని నిర్ణయిస్తే అభ్యర్థులకు కనీసం 48 గంటల అదనపు సమయం ఇవ్వాలని పేర్కొంది.
Also Read
- Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
- Coimbatore Blasts: 19 పేలుళ్లు, 58 మంది మృతి.. కోయంబత్తూర్ పేలుళ్ల నిందితులకు విజయ్ సర్కార్ పెరోల్.
- CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లకు బిగ్ రిలీఫ్..!
- SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
అవసరమైన ప్రాంతాల్లో కలెక్టరేట్ల వద్ద కూడా నామినేషన్లు స్వీకరించేందుకు అదనపు ఏర్పాట్లు చేయాలని సూచించింది. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీటీవీ నిఘా, వీడియో రికార్డింగ్ ద్వారా అభ్యర్థులకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పిడుగురాళ్ల, గురజాల, దర్శి, పుంగనూరు, మైదుకూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, రాయచోటి, దాచేపల్లి, గుత్తి, రాజంపేట, పులివెందుల, బద్వేల్, ప్రొద్దుటూరు, కనిగిరి, తాడిపత్రి, జమ్మలమడుగు మున్సిపాలిటీలతో పాటు వైఎస్సార్ కడప, తిరుపతి కార్పొరేషన్లు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి.
తాజావార్తలు
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
-
Coimbatore Blasts: 19 పేలుళ్లు, 58 మంది మృతి.. కోయంబత్తూర్ పేలుళ్ల నిందితులకు విజయ్ సర్కార్ పెరోల్.
-
CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లకు బిగ్ రిలీఫ్..!
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
ట్రెండింగ్
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!