AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, హైడ్రామాకు కేంద్రబిందువుగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష వైసీపీ నేతల హౌస్ అరెస్ట్‌లు, ముందస్తు అరెస్టులు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కడపలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. వైసీపీ కార్యాలయం వద్ద ముందస్తు చర్యల పేరుతో ఆయనను అరెస్ట్ చేసి, కడప టౌన్ పరిధి దాటించి వల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, పలువురు జడ్పీటీసీలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక కర్నూలు జిల్లాలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెల్దుర్తిలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమైన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న కారణంతో ఆమెను వెళ్లకుండా అడ్డుకోవడంతో, శ్రీదేవి రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని, శింగనమలలో మాజీ మంత్రి శైలజానాథ్‌ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తాడిమర్రిలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగడం లేదంటూ కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
- Road Accident: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..
- Trump: రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- India's Playing XI: కివీస్‌తో తొలి పోరు.. టీమిండియా తుది జట్టులో వైభవ్‌కు ఛాన్స్..?
మరోవైపు కాకినాడ జిల్లా తునిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తొండంగిలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. నిన్న తొండంగి ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం, రాళ్ల దాడి జరగడంతో రాజా నాలుగు గంటల పాటు బైఠాయించిన విషయం తెలిసిందే. నేడు మరోసారి నామినేషన్లకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు కట్టడి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార, ప్రతిపక్షాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరడంతో స్థానిక ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కింది.
తాజావార్తలు
-
AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
-
Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
-
Special Executive Magistrate: బ్రిటిష్ పాలన పోయినా.. నిర్బంధ చట్టాలు పోలేదా?
-
France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
-
INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!