NTV Telugu Site icon

AP Legislative Council: ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజును తిరిగి గుర్తించిన ఏపీ శాసనమండలి

Ap Legislative Council

Ap Legislative Council

AP Legislative Council: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిపై హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ శాసనమండలి స్పందించింది. ఇందుకూరి రఘురాజును ఎమ్మెల్సీగా తిరిగి శాసనమండలి గుర్తించింది. ఇటీవల విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌పై రఘురాజు హైకోర్టును ఆశ్రయించిన‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ రఘురాజుపై వైసీపీ వేసిన అనర్హత పిటిషన్‌పై మండలి ఛైర్మన్ తీసుకున్న అనర్హత వేటును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తుది తీర్పు సందర్భంగా అనర్హత వేటు చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2027 నవంబర్ చివరి వరకు ఎమ్మెల్సీగా రఘురాజు కొనసాగ వచ్చని హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నిలిచిపోయిన సంగతి కూడా విదితమే. తాజాగా ఇందుకూరి రఘురాజును ఎమ్మెల్సీగా తిరిగి శాసనమండలి గుర్తించడం గమనార్హం.

Read Also: Home Minister Anitha: విశాఖ లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై స్పందించిన హోం మంత్రి