NTV Telugu Site icon

AP Inter Results 2024: రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Ap Inter Results

Ap Inter Results

AP Inter Results 2024: ఏపీలో ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు విద్యామండలి అధికారికంగా ప్రకటించింది. ఈసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనున్నీ ఏప్రిల్‌ 10న మధ్యాహ్నంతో పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం విజయవాడలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో విడుదల చేయనున్నారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు.

Read Also: Summer: వేసవిలో చెరుకు రసంతో ఎన్ని లాభాలో..!

ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను httsps://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి ఫస్టియర్‌కు 5,17,617, సెకండ్ ఇయర్‌కు 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షా ఫలితాల రోజే ఇంప్రూమెంట్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించనున్నారు. వాటి ఫీజు వివరాలు కూడా ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇంటర్ ఫలితాల తేదీ ప్రకటన కావడంతో ఇంకా కొద్ది గంటల్లోనే తమ భవిష్యత్ తేలనుందన్న టెన్షన్‌లో విద్యార్థులున్నారు.

Show comments