Site icon NTV Telugu

Inter Exams : విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్‌ పరీక్షల టైం టేబుల్‌లో మార్పులు

Inter Exams

Inter Exams

ఏపీ ఇంటర్ పరీక్షల టైం టేబుల్‌లో మార్పలు చేస్తున్నట్లు ప్రకటించి ఇంటర్‌ బోర్డ్‌. ఇంటర్ పరీక్షలకు రివైజ్డ్ టైమ్ టేబుల్‌ను వెల్లడించింది. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఫస్ట్, సెకండియర్ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది ఇంటర్‌ బోర్డ్‌. ఉదయం 09 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే.. మార్చి-15న ఫస్టియర్ ఇంటర్ సెకండ్ లాంగ్వేజ్, మార్చి-16న
సెకండియర్ ఇంటర్ సెకండ్ లాంగ్వేజ్, మార్చి-17న ఫస్టియర్ ఇంటర్ ఇంగ్లిష్ (పేపర్-1), మార్చి-18న సెకండ్ ఇయర్ ఇంటర్ ఇంగ్లీష్ (పేపర్-2), మార్చి 20న ఫస్టియర్ ఇంటర్‌ మ్యాథ్స్ (పేపర్-1A), బోటనీ (పేపర్-1)
సివిక్స్ (పేపర్-1), మార్చి-21న సెకండ్ ఇయర్ ఇంటర్, ఫస్టియర్ ఇంటర్ మ్యాథ్స్ (పేపర్-2A), బోటనీ (పేపర్-2). సివిక్స్ (పేపర్-2), మార్చి-23న ఫస్టియర్ ఇంటర్ మ్యాథ్స్ (పేపర్-1B), జువాలజీ (పేపర్-1), హిస్టరీ (పేపర్-1), మార్చి-24న సెకండ్ ఇయర్ ఇంటర్ మ్యాథ్స్ (పేపర్-2B), జువాలజీ (పేపర్-2), హిస్టరీ (పేపర్-2), మార్చి-25న ఫస్టియర్ ఇంటర్ ఫిజిక్స్ (పేపర్-1) ఎకానమిక్స్ (పేపర్-1), మార్చి-27న సెకండియర్ ఇంటర్ ఫిజిక్స్ (పేపర్-2) ఎకానమిక్స్ (పేపర్-2), మార్చి-28న ఫస్టియర్ ఇంటర్ కెమిస్ట్రీ (పేపర్-1) కామర్స్ (పేపర్-1) సోషియాలజీ (పేపర్-1) ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ (పేపర్-1),

Also Read : YCP vs YCP: బెజవాడ మహిళల కొట్లాటలో కొత్త ట్విస్ట్

మార్చి-29న సెకండియర్ ఇంటర్ కెమిస్ట్రీ (పేపర్-2) కామర్స్ (పేపర్-2) సోషియాలజీ (పేపర్-2) ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ (పేపర్-2), మార్చి 31న ఫస్టియర్ ఇంటర్ పబ్లిక్ అడ్మిన్ (పేపర్-1) లాజిక్ (పేపర్-1) బ్రిడ్జి కోర్స్ మేథ్స్ (పేపర్-1), ఏప్రిల్-01న సెకండియర్ ఇంటర్ పబ్లిక్ అడ్మిన్ (పేపర్-2) లాజిక్ (పేపర్-2) బ్రిడ్జి కోర్స్ మేథ్స్ (పేపర్-2), ఏప్రిల్-03న మోడ్రన్ లాంగ్వేజ్ (పేపర్-1) జియోగ్రఫీ (పేపర్-1) ఏప్రిల్-04న మోడ్రన్ లాంగ్వేజ్ (పేపర్-2) జియోగ్రఫీ (పేపర్-2) నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి ఏడో తేదీ వరకు రెగ్యులర్ స్టూటెండ్స్ ప్రాకికల్స్ ఉంటాయని, ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి ఏడో తేదీ వరకు వోకేషనల్ కోర్స్ స్టూడెండ్స్ ప్రాకికల్స్ ఉంటాయని తెలిపింది. ఫిబ్రవరి-15వ తేదీన ఎథిక్స్ & హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ ఉంటాయని, ఫిబ్రవరి-17వ తేదీన ఎన్విరాన్మెంటెల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ఉంటుందని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

Also Read :Umran Malik: బంతులు బుల్లెట్లలా .. భారత ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉమ్రాన్‌ మాలిక్ రికార్డు

Exit mobile version