NTV Telugu Site icon

AP ECET and ICET 2024 Results: నేడే ఏపీ ఈసెట్, ఐసెట్‌ ఫలితాలు విడుదల..

Icet

Icet

AP ECET and ICET 2024 Results: ఆంధ్రప్రదేశ్‌లో ఈసెట్, ఐసెట్‌ 2024 పరీక్షల ఫలితాలను రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ఈసెట్‌ 2024 ఫలితాలను ఇవాళ (మే 30న) ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఈసెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 36, 369 మంది విద్యార్థులు ఎక్జామ్ కు హాజరయ్యారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీ- ఫార్మసీ సెకండ్ ఇయర్ లో నేరుగా ప్రవేశాలు పొందే అవకాశం ఉంది.

Read Also: Prajwal Revanna : నేడు భారత్‌కు ప్రజ్వల్ రేవణ్ణ.. బెంగళూరు ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేసే ఛాన్స్

అలాగే, ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌ 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు కూడా నేటి సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ మురళీకృష్ణ తెలిపారు. మే6వ తేదీన ఏపీలో 111, తెలంగాణళో 2 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 48, 828 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 44, 446 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల ప్రకటన తర్వాత త్వరలోనే కౌన్సెలింగ్‌ తేదీలను కూడా రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.