NTV Telugu Site icon

Home Minister Anitha: గంజాయి వ్యాపారులు, వినియోగదారులకు హోంమంత్రి మాస్ వార్నింగ్..

Vangalapudi Anitha

Vangalapudi Anitha

Home Minister Anitha: గంజాయి వ్యాపారులు, వినియోగదారులకు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు సేఫ్ గేమ్ మానేయాలని, ఓన్లీ స్ట్రయిట్ గేమ్స్ వుండాలని మంత్రి సూచించారు. మూడు నెలలు టైం ఇస్తున్నామని, పోలీసులు మారకపోతే మేం మార్పు చూపిస్తామని హెచ్చరించారు. గంజాయిపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ్టి నుంచి గంజాయి వ్యాపారం మీదే బతికేద్దాం అనుకునే వాళ్ళ ఆటలు సాగవన్నారు. ఏ పార్టీ నాయకుడు ప్రమేయం గుర్తించినా ఉపేక్షించేది లేదన్నారు.

Read Also: Student Suicide: మొబైల్‌లో గేమ్స్ ఆడొద్దన్నందుకు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

విశాఖలో గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కు పాదం మోపుతామమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఈరోజు రాత్రి 8 తర్వాత గుంపులుగా చేరి గంజాయి సేవించే వాళ్ళను గుర్తించి కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి కేసుల్లో విశాఖలోనే 1230 మంది జైల్లో ఉన్నారంటే ఇక్కడ పరిస్థితి అర్థం అవుతోందన్నారు. వైసీపీ నాయకులే గంజాయి వ్యాపారులు కావడంతో అక్రమ రవాణాపై దృష్టి పెట్టలేదని ఆమె విమర్శంచారు. కరివేపాకు పేరుతో డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. విశాఖలో గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ సరఫరా జరుగుతుంటే గత ప్రభుత్వం కనీస సమీక్ష కూడా చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల దగ్గర గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. గంజాయి కారణంగా క్రైమ్ రేట్ పెరిగిందని మంత్రి అనిత వెల్లడించారు.

కొంత మంది పోలీసుల్లో ఇప్పటికీ కొంత మందికి వైసీపీ మూలాలు వున్నాయని, వాటిని మార్చుకుంటే మంచిదని మంత్రి హెచ్చరించారు. దిశ పోలీసు స్టేషన్‌లు దిష్టిబొమ్మలుగా మారాయని, వాటి స్థానంలో మహిళా పోలీసు స్టేషన్లు మాత్రమే వుంటాయన్నారు. రాష్ట్రంలో మిస్ అయిన వేలాది మంది మహిళల కేసులను స్టడీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై రాళ్లు ఎవరికి వాళ్ళు వేసుకుంటే మాకేమీ సంబంధం లేదనన్నారు. నేరం చేసిన వారిపైనా చర్యలు తప్పవన్నారు. కక్ష పూరిత ఆలోచనలు వుంటే 164 నియోజకవర్గాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు బయట తిరగగలరా అంటూ ఆమె సమాధానమిచ్చారు.