NTV Telugu Site icon

Home Minister Vangalapudi Anitha: దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ.. రెండూ ఉండాలి.. శాంతి భద్రత విషయంలో రాజీలేదు

Vangalapudi Anitha

Vangalapudi Anitha

Home Minister Vangalapudi Anitha: దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ.. రెండూ ఉండాలి అంటూ డ్రైనింగ్‌ పూర్తి చేసుకున్న డీఎస్పీలకు సూచించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. ఇదే సమయంలో.. శాంతి భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.. అనంతపురంలో ప్రొబిషన్ డీఎస్పీల పాసింగ్ ఔట్‌ పరేడ్ లో పాల్గొన్నారు హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డీఎస్పీల నుంచి గౌరవ వందనం స్వీకరించారు హోం మంత్రి.. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డీఎస్పీలకు పథకాలను ఈ సందర్భంగా అందించారు హోం మంత్రి అనిత.. ఈ కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ.. త్వరలో అమరావతిలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు.. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డీఎస్పీలు విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ.. రెండూ ఉండాలి అని సూచించారు డీజీపీ ద్వారకా తిరుమలరావు..

Read Also: Yamuna River: కాలుష్య కోరల్లో యమున.. నదిలో విషపూరిత నురుగు

ఇక, డిఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ లో హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. మహిళలు, చిన్న పిల్లలపై ఆఘాయిత్యాలు పెరుగుతున్నాయి.. ఇవాళ నేరస్థులు కూడా పోలీసులకు దొరక్కుండా అప్ డేట్ అవుతున్నారు .. ఈ రోజు మనం అప్పాను కూడా నిర్మించుకోలేని పరిస్థితి ఉందన్నారు.. అయితే, లా అండ్ ఆర్డర్ ను పటిష్ఠం చేయాలి.. మా ముందు చాలా టాస్క్ లు ఉన్నాయి.. కానీ, శాంతి భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.. ప్రతి జిల్లాల్లో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు కోసం ఆలోచిస్తున్నాం అన్నారు.. ఆర్థిక, రాజకీయ, గంజాయి ముసుగులో అనేక ఉన్మాదాలు జరుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, పోలీస్ యూనిఫాం వేసుకున్నందుకు గర్వ పడండి.. విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించండి అంటూ ట్రైనింగ్‌ పూర్తిచేసుకున్న డీఎస్పీలకు సూచించారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.

Show comments