Taneti Vanitha: టీడీపీ, జనసేన పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన తర్వాత.. అధికార వైసీపీ నేతలను పవన్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక, టీడీపీ, జనసేన పొత్తుపై స్పందించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత.. టీడీపీ, జనసేన పొత్తు బ్రేకింగ్ న్యూస్ కాదన్నారు.. నిన్న చంద్రబాబుతో మాట్లాడడానికి వెళ్ళారా..? లేక ఇంకా దేనికోసమైనా వెళ్లారా? అంటూ ప్రశ్నించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన తానేటి వనిత.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇన్నిరోజులు ఒకరికొకరు కలిసి ప్రయాణం చేస్తున్నారు.. ఇప్పుడు కొత్తేమీ కాదని కొట్టిపాడేశారు. పవన్ ఈజీగా అబద్ధాలు చెప్పుతున్నారని విమర్శించారు. వారాహి యాత్ర కూడా చంద్రబాబు చెబితేనే పవన్ కల్యాణ్ చేస్తున్నారు.. చంద్రబాబు స్క్రిప్ట్ పవన్ చదువుతున్నారని వ్యాఖ్యానించారు.
Read Also: iPhone 12 Price: డెడ్ చీప్‌గా ఐఫోన్.. రూ 17,399కే మీ సొంతం!
మరోవైపు.. గతంలో చంద్రబాబుపై పవన్ కల్యాణ్ నీచంగా మాట్లాడారని, రాజకీయాల్లో ఎలా ఉండాలి ప్రజలకు ఎలా అందుబాటులో ఉండి, ప్రజలకు ఏమి కావాలి అనే విధంగా రాజకీయాలు ఉండాలని అన్నారు మంత్రి వనిత.. ఇక, కేసు విచారణ జరుగుతోంది.. అందులో ఎవరెరు ఉన్నారు అనేది ఎంక్వేరీ జరుగుతుందని వివరించారు. నేను రాజమండ్రిలో ఉన్నాను అంటే నారా లోకేష్‌ని ఎవరూ అరెస్ట్ చేయరని పవన్ కల్యాణ్ చెబుతున్నారంటూ దుయ్యబట్టారు. టీడీపీ నాయకులు అబద్ధాలను పడే పదే మాట్లాడతున్నారని మండిపడ్డారు. సెంట్రల్ జైలులో బ్లాక్ మొత్తం చంద్రబాబుకి కేటాయించాం.. సీసీ కెమెరాలతో పాటు భద్రత కట్టు దిట్టంగా ఉందని తెలియజేశారు. మరోవైపు.. సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ వ్యవహారంపై స్పందిస్తూ.. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్యకు అనారోగ్యం కారణంగా.. ఆయన సెలవు పెట్టారని వివరణ ఇచ్చారు హోంశాఖ మంత్రి తానేటి వనిత.