AP High Court: చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై నేడు హైకోర్టు తీర్పు

Ap High Court

Ap High Court

AP High Court: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేసిన తర్వాత.. మరికొన్ని కేసులు తెరపైకి వచ్చాయి.. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు, మద్యం కేసు, ఇసుక కేసు.. ఇలా పలు కేసుల్లో సీఐడీ దూకుడు చూపించింది.. అయితే, ఈ మూడు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మొదట మధ్యంతర బెయిల్‌ పొందిన చంద్రబాబుకు ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్ కూడా మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. ఇక, ఐఆర్‌ఆర్, మద్యం కేసు, ఇసుక కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేయగా.. ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. ఈ కేసుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఈ రోజు అన్ని కేసుల్లో మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు వెలువరించనుంది. దీంతో.. హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Read Also: Mohammed Shami: దేశం కోసం నిరంతరం శ్రమిస్తా.. షమీ భావోద్వేగ పోస్టు!