Site icon NTV Telugu

Ram Gopal Varma: రామ్‌గోపాల్‌ వర్మకు బెయిల్ వస్తుందా..? నేడు మూడు పిటిషన్లపై విచారణ

Rgv

Rgv

Ram Gopal Varma: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేయనుంది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. మొత్తం మూడు పిటిషన్లు దాఖలు చేశారు వర్మ.. ప్రకాశం జిల్లా, విశాఖ జిల్లా, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోరుతూ.. హైకోర్టు మెట్లు ఎక్కారు వివాదాస్పద దర్శకుడు.. గతంలో విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. అన్ని పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన విషయం విదితమే..

Read Also: SRH Team: ఇషాన్, షమీ, సచిన్‌.. ఈసారి పక్కా కప్! సన్‌రైజర్స్ ఫుల్ టీమ్ ఇదే

అయితే, దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఆచూకీపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆర్జీవీ డెన్‌ నుంచి ఏపీ పోలీసులు వెనుదిరిగారు. శంషాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో తలదాచుకున్నారనే సమాచారంతో.. పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడి కూడా ఆయన లేరని తెలుస్తోంది. అయితే వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని ఆర్జీవీ లీగల్ టీమ్‌ చెబుతుంది. డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు గాలిస్తున్నారు. విచార‌ణ‌కు రెండుసార్లు డుమ్మా కొట్టడంతో సీరియ‌స్ అయిన పోలీసులు నేరుగా వ‌ర్మ ఇంటికి వెళ్లారు. ఉదయం నుంచి RGV ఆఫీస్ దగ్గర హడావుడి చేశారు. సెర్చ్ వారెంట్ లేకపోవడంతో గేటు దాటి డెన్‌ లోపలికి వెళ్లలేదు. అయితే ఆయన… ఎక్కడున్నారనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. శంషాబాద్‌లోని ఫామ్‌హస్‌లో తలదాచుకున్నారనే సమచారంతో… ఆక్కడికి వెళ్లారు పోలీసులు. అక్కడా కూడా ఆర్జీవీ లేకపోవడంతో వెనుదిరిగారు.

Read Also: Nana Patole: రాజీనామా వార్తలు ఖండించిన మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్

మరోవైపు… విచారణకు వర్చ్యువల్‌గా హాజరయ్యేందుకు సిద్ధమని RGV లీగల్ టీమ్ ప్రకటించింది. BNSS చట్ట ప్రకారం వర్చ్యువల్‌గా హాజరయ్యేందుకు అవకాశం ఉందని అంటోంది లీగల్ టీమ్. పోలీసులు RGVని అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం ఎదుర్కొంటామని అంటున్నారు. ఇప్పటికే వర్మ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయం విదితమే కాగా.. నేడు ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరపనుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అయితే, ఆర్జీవీకి ముందస్తు బెయిల్‌ వస్తుందా? బెయిల్‌ రాకపోతే ఆర్జీవీని పోలీసులు అరెస్ట్‌చేయడం ఖాయమా? అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది..

Exit mobile version