Site icon NTV Telugu

Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

Pinnelli

Pinnelli

Pinnelli Ramakrishna Reddy: వైసీపీ మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ముందస్తు బెయిల్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు మరో 3 కేసులను పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పల్నాడు పోలీసులు నమోదు చేశారు. గతంలో ఈ కేసులకు సంబంధించి విచారణ చేపట్టిన కోర్టు.. అరెస్ట్‌ నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ షరతులు విధించింది. ఈ పిటిషన్లపై హైకోర్టులో నేడు తుది వాదనలు జరిగాయి. తీర్పు వచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు పొడిగించింది.

Read Also: AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ కీలక నిర్ణయం.. వారికి కూడా నో ఎంట్రీ..

Exit mobile version