AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన టెట్, టీఆర్టీ(టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) నోటిఫికేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ రెండు పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని పేర్కొంది. రాతపరీక్ష పై అభ్యంతరాలు స్వీకరణకు సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), ఏపీ టీచర్ నియామక పరీక్ష (ఏపీ టీఆర్‌టీ)ల మధ్య సముచిత సమయం ఉండేలా షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టుప్రభుత్వానికి సోమవారం ఆదేశాలు జారీ చేసింది. టెట్, ఏపీ టీఆర్‌టీ ల మధ్య సముచిత సమయం ఉండేలా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గత బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ తీర్పును రిజర్వ్ చేశారు.
Read Also: PM Narendra Modi: రేపు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన
టెట్, టీఆర్‌టీల మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం. పెద్దిరాజు, మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత నోటిఫికేషన్ రద్దుచేసి ఈ పరీక్షల నిర్వహణకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. టెట్ ముగిసిన తర్వాత టీఆర్‌టీ రాయడానికి సిద్ధమయ్యేందుకు తగిన సమయం లేదని, అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని ఆయన న్యాయస్థానానికి విన్నవించారు.