NTV Telugu Site icon

AP High Court: దుర్గగుడి ఈవో భ్రమరాంబకు ఏపీ హైకోర్టు నోటీసులు

Ap High Court

Ap High Court

AP High Court: విజయవాడ దుర్గగుడి ఈవో భ్రమరాంబకు ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కరోనా సమయంలో తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని న్యాయస్థానం ఆ నోటీసుల్లో ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు అమలు చేయనందుకు కోర్టుకు రావాలని ఆదేశించింది. ఈ నెల 8న కోర్టుకు హాజరుకావాలని ఈవోకు నోటీసులు జారీ చేసింది.

AP Govt: టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం

ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టి ఈ మేరకు నోటీసులు దారీ చేసింది. రెగ్యులరైజేషన్‌లో అన్యాయం జరిగిందని ఆలయ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జూనియర్లను రెగ్యులర్ చేసి తమను పక్కన బెట్టారన్న ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులు పంపినా ఈవో స్పందించలేదని తెలుస్తోంది. దీంతో ధిక్కరణ కేసులో భాగంగా ఈవో భ్రమరాంబ కోర్టులో హాజరుకావాలని న్యాయస్థానం నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

Show comments