NTV Telugu Site icon

AP High Court: కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ హైకోర్టు నోటీసులు

High Court

High Court

AP High Court: కేంద్ర ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. ఓటర్ల జాబితా తయారీలో పారదర్శకత పాటించటం లేదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.. ఒకే ఇంట్లో ఉండే ఇద్దరికి వేర్వేరు చోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు కల్పించారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. నిబంధనల ప్రకారం 2 కిలో మీటర్ల లోపల ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు కల్పించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా జరుగుతోందని పిటిషనర్‌ వాదనగా ఉంది.. తమ అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోకుండా ఫైనల్ లిస్ట్ ప్రకటించారని కోర్టుకు తెలిపారు పిటిషనర్.. అయితే.. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, కృష్ణా జిల్లా కలెక్టర్, ఆర్డీవోకి నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.. ఇక, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.

Read Also: Madhya Pradesh: పాకెట్ మనీ ఇవ్వలేదని తండ్రిని బండరాయితో కొట్టి చంపిన కొడుకు