Site icon NTV Telugu

Group-1 examination: గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు కీలక ఆదేశాలు

Appsc

Appsc

Group-1 examination: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్ష రద్దుపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వారు కొనసాగుతారని ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు డివిజన్ బెంచ్.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు.. కాగా, గ్రూప్‌-1 పరీక్ష రద్దుపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ లో సవాలు చేసింది ఏపీపీఎస్సీ.. అయితే, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఉద్యోగులు కొనసగవచ్చని ఏపీ హైకోర్టు పేర్కొంది.

Read Also: Razole Assembly: ఉత్కంఠకు తెర.. రాజోలు జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్..

కాగా, 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేయాలని.. మళ్లీ పరీక్ష నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ జడ్జి తీర్పు ఇచ్చారు.. ఇక, సింగిల్ బెంచ్ తీర్పును.. ఏపీపీఎస్సీ హైకోర్టులో సవాల్‌ చేసింది.. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది.. వీటిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఏపీపీఎస్సీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.ఎస్‌ ప్రసాద్‌ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌.. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వారు కొనసాగుతారని ఆదేశాలు ఇచ్చింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

Exit mobile version