Site icon NTV Telugu

Employees Retirement Age: రిటైర్మెంట్ ఏజ్‌.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Ap High Court

Ap High Court

Employees Retirement Age: రిటైర్మెంట్ ఏజ్‌ విషయంలో కీలక తీర్పు వెలువరించింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 పెంచాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APEWID) ఉద్యోగులు.. అయితే, రిటైర్మెంట్ వయస్సును 62కు పెంచుతూ గతంలో ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్.. కానీ, ఈ ఆదేశాలను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం.. ఏపీ సర్కార్ తరఫున పిటిషన్ దాఖలు చేశారు APEIDC ఎండీ, ప్రిన్సిపల్ సెక్రటరీ..

Read Also: Karnataka Elections 2023: రేపే పోలింగ్‌.. ఏర్పాట్లు పూర్తి

రిటైర్మెంట్ వయస్సు పెంపు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉంటుందని.. కార్పొరేషన్ లో పనిచేసే వాళ్లకు కాదని హైకోర్టులో వాదనలు వినిపించింది ప్రభుత్వం.. కార్పొరేషన్ ఉద్యోగులకు సర్వీస్ నిబంధనలు వేరుగా ఉంటాయి కాబట్టి రిటైర్మెంట్ వయస్సు పెంచటానికి చట్ట సవరణ కుదరదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.. ఇక, ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను పక్కన పెడుతూ తాజాగా తీర్పు వెలువరించింది.. ప్రభుత్వ పిటిషన్ అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది డివిజన్ బెంచ్. దీంతో.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించగా.. ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగులకు మాత్రం ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. మొత్తంగా కార్పొరేషన్లలో పని చేసే ఉద్యోగులకూ ఉద్యోగ విరమణ వయస్సు పెంపు వర్తించదు అని స్పష్టం చేసింది హైకోర్టు.

Exit mobile version